RSS అంటే ఎంటి ? simple గా చెప్పాలంటే ఇది XML అంతే. title, link, description మొదలయిన elements ఉండే ఒక XML document అన్నమాట.
RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఎన్నివున్నా కేవలం కొన్నింటిని మాత్రమే ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తుంటాయి. అయితే ప్రపంచం ఏ మూలనో జరిగే సంఘటనల వివరాలను అందించేందుకు న్యూస్ వెబ్‌సైట్లు పోటీపడుతుంటాయి. ఇటువంటి సైట్లను ప్రతిరోజూ మనం చూస్తూనే వుంటాం. ఇన్ని సైట్లలో ఏ సైట్లో ఏ సమాచారం కొత్తగా చేర్చారో తెలుసుకోవడం ఒకింత కష్టమే. అలాకాకుండా ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది కదూ. ఖచ్చితంగా అదే పనిని ఈ RSS ఫీడ్లు చేస్తాయి. బ్లాగర్, బ్లాగ్ ఫీడ్‌లను స్వయంచాలకంగా ఉత్పన్నం చేయడానికి Atom ప్రమాణాన్ని వినియోగిస్తుంది.
అసలు ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలున్నాయి? చానల్ గ్రూప్‌లను జత చేయడం ఎలా? ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి? అందుబాటులో వున్న రీడర్లు ఏంటి? వంటి వివరాలు...
ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి?
“Really Simple Syndication” అనే పదానికి సంక్షిప్త రూపమే RSS ఫీడ్లను ఉత్పన్నం చేసే పక్రియనే సిండికేషన్ అంటారు. ఎక్స్‌ఎంఎల్ ఆధారంగా పనిచేసే RSS వివిధ వెబ్‌సైట్లను విజిట్‌చేసి తేదీ, హెడ్డింగ్, లింక్‌ల ఆధారంగా ఆయా వెబ్‌సైట్లలో కొత్తగా ఏదైనా సమాచారం పొందుపరచబడిందేమో గుర్తిస్తుంది. కొత్త సమాచారం కన్పించిన వెంటనేFeed Demon వంటి ఆర్‌ఎస్‌ఎస్ రీడర్ సాఫ్ట్‌వేర్స్ ఈ సరికొత్త సమాచారాన్ని గురించి క్లుప్తంగా వివిధ ప్రోగ్రామ్‌లలో డిస్‌ప్లే చేస్తుంది. ఒకవేళ ఆ కొత్త సమాచారంలో ఏదైనా హెడ్డింగ్ మనల్ని ఆకట్టుకుందనుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేరుగా ఆ న్యూస్ వున్న వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. అంటే ఏ ఒక్క వెబ్‌సైట్‌నీ నేరుగా విజిట్ చేయకుండానే వాటిలో కొత్తగా చోటుచేసుకున్న సమాచారాన్ని మన డెస్క్‌టాప్‌పై తెలుసుకోవచ్చన్నమాట.
RSS Readersలో రకాలు...
RSS Feedలను సేకరించడానికి మన సిస్టమ్‌లో RSS Reader సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చెయ్యాలి. కొన్ని రీడర్లు సపరేట్ ప్రోగ్రాములుగానూ, మరికొన్ని రీడర్లుIE, Outlook వంటి ప్రోగ్రాములకు plug-insగానూ లభిస్తుంటాయి. ప్లగ్‌ఇన్‌లుగా దొరికే RSS Readerలను నేరుగా ఆయా పేరెంట్ అప్లికేషన్ నుండే ఉపయోగించవచ్చు. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగించే వారు బ్రౌజర్ టూల్స్ ఆప్షన్‌లోని యాడ్-ఆన్స్ నుండి 124రకాల ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్స్‌ను పొందవచ్చు. వీటిలో క్రికెట్ స్కోర్‌నుండి పిడిఎఫ్‌ల సెర్చ్ వరకు అన్నిరకాల సమాచారాన్నీ పొందవచ్చు. Feed Demon అనేది సపరేట్ అప్లికేషన్ మాదిరిగా పని చేస్తుంది. ఓపెన్‌సోర్స్‌లోనూ ఇటువంటి అప్లికేషన్స్ అనేకం వున్నాయి. వాటిలో RSSOwl ఒకటి. దీన్ని http://www.rssowl.org/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Channel గ్రూప్‌లను జతచేయడం :
దాదాపు అన్ని RSS రీడర్ సాఫ్ట్‌వేర్లలో పలు RSS ఛానెళ్లు రెడీమేడ్‌గానే ఉంటాయి. సాధారణంగా ఆన్‌లైన్ న్యూస్‌ఐటమ్‌లను అందించే ప్రతీ వెబ్‌సైట్‌లోనూ RSS Feedsకి సంబంధించిన లింక్‌లు ఉంటాయి. మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న RSS Reader అప్లికేషన్‌లో కొత్త ఛానెల్‌ని జత చెయ్యాలంటే సింపుల్‌గా ఆ లింక్‌ని కాపీ చేసుకుని File>New>Channel అనే ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. ఇకపై ఆ కొత్త ఛానెల్ సైతం RSS Reader లో వస్తుంది.
కావలసిన న్యూస్‌ని వెతకడానికి:
అనేక రకాల RSS ఫీడ్‌ల నుండి భారీ మొత్తంలో న్యూస్ పేరుకుపోయినప్పుడు కేవలం మనకు కావలసిన న్యూస్‌ని మాత్రమే వెదికి పట్టుకోవడానికి ప్రతీ RSS Reader సాఫ్ట్‌వేర్‌లోనూ Search ఆప్షన్ ఉంటుంది. కొన్ని సాఫ్ట్‌వేర్లలో అయితే ఫీడ్ మన సిస్టమ్‌లోకి వచ్చే సమయంలోనే మనం పేర్కొన్న కీవర్డ్‌కి సంబంధించిన ఫీడ్ ఏదైనా వాటిలో ఉన్నట్లయితే వెంటనే మనకు సమాచారం అందించే సదుపాయం కూడా లభిస్తోంది.
అందుబాటులో ఉన్న రీడర్లు :
RSS ఫీడ్‌లను సేకరించడానికి అనేక సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలోAwasu, Feed Demon, RSS Reader తదితరల సాఫ్ట్‌వేర్లు సిస్టమ్‌లో సపరేట్ ప్రోగ్రామ్‌గా ఇన్‌స్టాల్ అయి బ్యాక్‌గ్రౌండ్‌లో RSS Feedల నుండి సమాచారాన్ని సేకరిస్తుంటాయి.FeedDemon వంటివాటిని డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి వుంటుంది. ఇదే రకమైనపనిని మరింత మెరుగ్గా చేసే ఓపెన్స్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ కూడా నెట్‌లో లభ్యం అవుతాయి. విండోస్‌లో లభ్యమయ్యే సాఫ్ట్‌వేర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్స్‌ను http://www.osalt.com/ ఈ సైట్ నుండి పొందవచ్చు. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్స్‌కు సంబంధించి RSSOwl, RSS Bandit వంటి సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రోగ్రాములు కేవలం RSS Feedలను మాత్రమే కాకుండా Blog సైట్ల నుండి blogలను సైతం సేకరించిపెడతాయి.
ఇంతకు ముందు ఎక్కువగా mailing lists ని వాడేవారు. కానీ వాటితో ఎన్నో సమస్యలు. స్పాం బెడద ఎక్కువగా ఉండేది కూడా. అలా కాకుండా users కి కావలసిన విధంగా updates అందుకునే విధంగా ఈ RSS ఉపయొగపడుతుంది.
ఇది అందించే వెబ్ సైట్ కీ, users కీ ఇద్దరికీ సమానంగా ఉపయొగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుసుకోవడానికి users కీ, users ని ఆకర్షించడానికి వెబ్ సైట్ లకూ ఉపయొగపడుతుంది.
అంతే కాక ఇప్పుడు మనం చూస్తున్న Digg, Lifehacker, Techmeme, TechCrunch, Reddit, లాంటి వెబ్ సైట్ లు అన్నీ ప్రచారం పొందడానికి కూడా ఈ RSS పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు తయారయే ఏ వెబ్ సైట్ కన్నా RSS ఉంటుంది. అదే కాక అన్ని బ్లాగులకీ, న్యూస్ సైట్లకి కూడా ఈ సౌకర్యం ఉంటుంది. వారు కొత్త సమాచారం publish చెయ్యగానే మీకిట్టే తెలిసిపోతుంది RSS feeds ద్వారా.
మరి ఈ XML లాగా ఉండే RSS చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకనే దానికోసం Feed Readers అనే సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి desktop సాఫ్ట్ వేర్ల గానూ, వెబ్ వెర్షన్లలోనూ ఉంటాయి. thunderbird లాంటి డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ల లోను, bloglines, Google Reader వంటి వెబ్ వర్షన్లలో లభ్యం. వీటిలో మీకు నచ్చిన RSS ఫీడ్లను add చేసుకుని చదవచ్చు. ఇవే కాక netvibes లాంటివి కూడా ఎంతో ఉపయొగకరం.
పైన చెప్పుకున్న లాభాలే కాక మీరు కూడా వేరు వేరు వెబ్ సైట్ల నుంచి ఫీడ్లను ఉపయొగించి మీ సొంత applications రాయవచ్చు (feed aggregators). ఉదాహరణకి Google News, కూడలి, తేనెగూడు లాగా.
ఇంతకీ ఒక వెబ్ సైట్ కి ఈ RSS సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?
మీరు ఎదయిన వెబ్ సైట్ కి వెళ్ళినప్పుడు ఈ క్రింద లాంటి icons చూస్తే గనక దానికి ఈ RSS సౌలభ్యం ఉన్నట్టే.

అదే కాక ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌసర్లు కూడా వీటిని ప్రత్యెకంగా చూపిస్తాయి మీ URL bar లో.

ఇక మీరు వీటిని పోగేసుకుని సమాచారం అందుకోవడమే తరువాయి.
గమనిక: RSS లాంటి standards ఇంకా వేరే కూడా ఉన్నాయి. Atom అందులో ఒకటి. RSS 1.0, 2.0 version లు కూడా ఉన్నాయి.
RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఎన్నివున్నా కేవలం కొన్నింటిని మాత్రమే ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తుంటాయి. అయితే ప్రపంచం ఏ మూలనో జరిగే సంఘటనల వివరాలను అందించేందుకు న్యూస్ వెబ్‌సైట్లు పోటీపడుతుంటాయి. ఇటువంటి సైట్లను ప్రతిరోజూ మనం చూస్తూనే వుంటాం. ఇన్ని సైట్లలో ఏ సైట్లో ఏ సమాచారం కొత్తగా చేర్చారో తెలుసుకోవడం ఒకింత కష్టమే. అలాకాకుండా ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది కదూ. ఖచ్చితంగా అదే పనిని ఈ RSS ఫీడ్లు చేస్తాయి. బ్లాగర్, బ్లాగ్ ఫీడ్‌లను స్వయంచాలకంగా ఉత్పన్నం చేయడానికి Atom ప్రమాణాన్ని వినియోగిస్తుంది.
అసలు ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలున్నాయి? చానల్ గ్రూప్‌లను జత చేయడం ఎలా? ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి? అందుబాటులో వున్న రీడర్లు ఏంటి? వంటి వివరాలు...
ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి?

RSS Readersలో రకాలు...
RSS Feedలను సేకరించడానికి మన సిస్టమ్‌లో RSS Reader సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చెయ్యాలి. కొన్ని రీడర్లు సపరేట్ ప్రోగ్రాములుగానూ, మరికొన్ని రీడర్లుIE, Outlook వంటి ప్రోగ్రాములకు plug-insగానూ లభిస్తుంటాయి. ప్లగ్‌ఇన్‌లుగా దొరికే RSS Readerలను నేరుగా ఆయా పేరెంట్ అప్లికేషన్ నుండే ఉపయోగించవచ్చు. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగించే వారు బ్రౌజర్ టూల్స్ ఆప్షన్‌లోని యాడ్-ఆన్స్ నుండి 124రకాల ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్స్‌ను పొందవచ్చు. వీటిలో క్రికెట్ స్కోర్‌నుండి పిడిఎఫ్‌ల సెర్చ్ వరకు అన్నిరకాల సమాచారాన్నీ పొందవచ్చు. Feed Demon అనేది సపరేట్ అప్లికేషన్ మాదిరిగా పని చేస్తుంది. ఓపెన్‌సోర్స్‌లోనూ ఇటువంటి అప్లికేషన్స్ అనేకం వున్నాయి. వాటిలో RSSOwl ఒకటి. దీన్ని http://www.rssowl.org/ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Channel గ్రూప్‌లను జతచేయడం :
దాదాపు అన్ని RSS రీడర్ సాఫ్ట్‌వేర్లలో పలు RSS ఛానెళ్లు రెడీమేడ్‌గానే ఉంటాయి. సాధారణంగా ఆన్‌లైన్ న్యూస్‌ఐటమ్‌లను అందించే ప్రతీ వెబ్‌సైట్‌లోనూ RSS Feedsకి సంబంధించిన లింక్‌లు ఉంటాయి. మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న RSS Reader అప్లికేషన్‌లో కొత్త ఛానెల్‌ని జత చెయ్యాలంటే సింపుల్‌గా ఆ లింక్‌ని కాపీ చేసుకుని File>New>Channel అనే ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. ఇకపై ఆ కొత్త ఛానెల్ సైతం RSS Reader లో వస్తుంది.
కావలసిన న్యూస్‌ని వెతకడానికి:
అనేక రకాల RSS ఫీడ్‌ల నుండి భారీ మొత్తంలో న్యూస్ పేరుకుపోయినప్పుడు కేవలం మనకు కావలసిన న్యూస్‌ని మాత్రమే వెదికి పట్టుకోవడానికి ప్రతీ RSS Reader సాఫ్ట్‌వేర్‌లోనూ Search ఆప్షన్ ఉంటుంది. కొన్ని సాఫ్ట్‌వేర్లలో అయితే ఫీడ్ మన సిస్టమ్‌లోకి వచ్చే సమయంలోనే మనం పేర్కొన్న కీవర్డ్‌కి సంబంధించిన ఫీడ్ ఏదైనా వాటిలో ఉన్నట్లయితే వెంటనే మనకు సమాచారం అందించే సదుపాయం కూడా లభిస్తోంది.
అందుబాటులో ఉన్న రీడర్లు :
RSS ఫీడ్‌లను సేకరించడానికి అనేక సాఫ్టవేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలోAwasu, Feed Demon, RSS Reader తదితరల సాఫ్ట్‌వేర్లు సిస్టమ్‌లో సపరేట్ ప్రోగ్రామ్‌గా ఇన్‌స్టాల్ అయి బ్యాక్‌గ్రౌండ్‌లో RSS Feedల నుండి సమాచారాన్ని సేకరిస్తుంటాయి.FeedDemon వంటివాటిని డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి వుంటుంది. ఇదే రకమైనపనిని మరింత మెరుగ్గా చేసే ఓపెన్స్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ కూడా నెట్‌లో లభ్యం అవుతాయి. విండోస్‌లో లభ్యమయ్యే సాఫ్ట్‌వేర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓపెన్‌సోర్స్ సాఫ్ట్‌వేర్స్‌ను http://www.osalt.com/ ఈ సైట్ నుండి పొందవచ్చు. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ ఫీడ్స్‌కు సంబంధించి RSSOwl, RSS Bandit వంటి సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రోగ్రాములు కేవలం RSS Feedలను మాత్రమే కాకుండా Blog సైట్ల నుండి blogలను సైతం సేకరించిపెడతాయి.
ఇంతకు ముందు ఎక్కువగా mailing lists ని వాడేవారు. కానీ వాటితో ఎన్నో సమస్యలు. స్పాం బెడద ఎక్కువగా ఉండేది కూడా. అలా కాకుండా users కి కావలసిన విధంగా updates అందుకునే విధంగా ఈ RSS ఉపయొగపడుతుంది.
ఇది అందించే వెబ్ సైట్ కీ, users కీ ఇద్దరికీ సమానంగా ఉపయొగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం తెలుసుకోవడానికి users కీ, users ని ఆకర్షించడానికి వెబ్ సైట్ లకూ ఉపయొగపడుతుంది.
అంతే కాక ఇప్పుడు మనం చూస్తున్న Digg, Lifehacker, Techmeme, TechCrunch, Reddit, లాంటి వెబ్ సైట్ లు అన్నీ ప్రచారం పొందడానికి కూడా ఈ RSS పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు తయారయే ఏ వెబ్ సైట్ కన్నా RSS ఉంటుంది. అదే కాక అన్ని బ్లాగులకీ, న్యూస్ సైట్లకి కూడా ఈ సౌకర్యం ఉంటుంది. వారు కొత్త సమాచారం publish చెయ్యగానే మీకిట్టే తెలిసిపోతుంది RSS feeds ద్వారా.
మరి ఈ XML లాగా ఉండే RSS చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకనే దానికోసం Feed Readers అనే సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి desktop సాఫ్ట్ వేర్ల గానూ, వెబ్ వెర్షన్లలోనూ ఉంటాయి. thunderbird లాంటి డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ల లోను, bloglines, Google Reader వంటి వెబ్ వర్షన్లలో లభ్యం. వీటిలో మీకు నచ్చిన RSS ఫీడ్లను add చేసుకుని చదవచ్చు. ఇవే కాక netvibes లాంటివి కూడా ఎంతో ఉపయొగకరం.
పైన చెప్పుకున్న లాభాలే కాక మీరు కూడా వేరు వేరు వెబ్ సైట్ల నుంచి ఫీడ్లను ఉపయొగించి మీ సొంత applications రాయవచ్చు (feed aggregators). ఉదాహరణకి Google News, కూడలి, తేనెగూడు లాగా.
ఇంతకీ ఒక వెబ్ సైట్ కి ఈ RSS సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా ?
మీరు ఎదయిన వెబ్ సైట్ కి వెళ్ళినప్పుడు ఈ క్రింద లాంటి icons చూస్తే గనక దానికి ఈ RSS సౌలభ్యం ఉన్నట్టే.

అదే కాక ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌసర్లు కూడా వీటిని ప్రత్యెకంగా చూపిస్తాయి మీ URL bar లో.

ఇక మీరు వీటిని పోగేసుకుని సమాచారం అందుకోవడమే తరువాయి.
గమనిక: RSS లాంటి standards ఇంకా వేరే కూడా ఉన్నాయి. Atom అందులో ఒకటి. RSS 1.0, 2.0 version లు కూడా ఉన్నాయి.
0 comments:
Post a Comment