తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 2
Expandable Posts and/or Show/Hide Text within Posts:
మీ టపాకు సంబంధించి చాలా సమయం వెచ్చించి, పరిశోధన చేసి, వెతికి వెతికి కష్టపడి సమాచార సేకరణ చేసినప్పుడు మరియు మీ వ్రాసే టపాపై మీకు చాలా గట్టి పట్టు ఉండి ఎక్కువ pages రాసినప్పుడు, చదువరులు/పాఠకులకు మీరు అంతా ఒకే సారి చూపించ ప్రయత్నించకుండా (అలా చేసినచో వామ్మో చాలా పెద్ద టపా అని వారు పారిపోయే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తే) ముందు కొంత Summary ప్రచురించి తరువాత 'Read More లేక మిగిలిన విషయం కొరకు' అనే లంకె ను ఇచ్చి దానిని నొక్కినప్పుడు మిగతా టపాను అక్కడే అంటే అదే page లో లేక మరొక page కి పంపించ ప్రయత్నించదలచినచో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
WordPress లో ఇలా 'peekaboo' పోస్ట్స్ తయారు చేయటం చాలా తేలిక (ఉదాహరణకు మీ దగ్గర MicroSoft Windows LiveWriter ఉన్నట్లైతే ఎలా చేయచ్చో కింద ఉన్న Image ని చూడండి మీకే అర్ధం అవుతుంది).
అదే మనం Blogger లో చేయాలి అంటే కొంచెం కష్టపడాలి. కనుక మీలో ఎవరికైనా ఇది Blogger లో implement చేయాలనే ఉత్సాహం ఉంటే Expandable posts with Peekaboo view ద్వారా మీరు దానిని ప్రయత్నించవచ్చు. ఒకవేళ మీరు ముందు దీని Demo ని చూడాలి అనుకుంటే ... ఇదిగో దానికి సంబంధించిన లంకె: Demo - Exapandable Summaries.
ఒకవేళ మీకు మీ టపాలోనే కొంత భాగాన్ని పాఠకుడు నొక్కినప్పుడు మాత్రమే చూపాలి/దాయాలి అనిపిస్తే .... మీ బ్లాగ్ లో ఉన్నది Classic Template అయితే ఇలా లేదా Layout Based Template అయితే ఇలా చేసి మీరు అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చు.
Summary of Post:
కొంచెం కష్టమనుకోకుండా మనమందరం ప్రచురించే ప్రతి టపాకు(కవితలు,Jokes, Photos లాంటి వాటికి మినహాయింపు ఇవ్వవచ్చేమో) అది రాయటానికి కారణం లేక మూలం లేక ప్రేరణ లేక దేనికి సంబంధించింది అనే వాటి గురించి కనీసం ఒకటో రెండో వాక్యాలు రాస్తే మిగిలిన బ్లాగర్స్ ఈ టపాల గురించి వారి బ్లాగుల్లో చెప్ప/చూపటానికి సులభమవుతుంది మరియు మన బ్లాగు/టపాకి వచ్చే పాఠకుడికి మనం ఒక మంచి అవగాహనను కలిగించిన వారమవుతాము.
ఒకసారి మీరు నేను ఇంతకు ముందు ప్రచురించిన టపా 'నాకు నచ్చిన బ్లాగులు-టపాలు' ని చూసినట్లైతే నేను అతి కొద్ది టపాలకు మాత్రమే summary ని copy/paste చేయగలిగాను కాని మిగతా టపాలన్నీ ఆణిముత్యాలలాంటివి (కనీసం నా దృష్టిలో) అయినా కూడా ఆ టపా లంకె ను మాత్రమే ఇవ్వగలిగాను అందువలన ఆ టపాల గురించి ఇంకా ఎక్కువ ఉత్సుకతను కలిగించలేకపోయానేమో అనిపిస్తుంది.
Single Theme :
తెలుగు బ్లాగుల రాశి గతకొద్ది కాలంగా బాగా పెరగటం వలన మరియు కొత్త బ్లాగులు వస్తున్న వేగం చూసిన తరువాత ఇక మన బ్లాగులను 'ఒక బ్లాగు - ఒకే ప్రధాన విషయం' (Only One Theme per Blog) గా మలచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అనిపిస్తుంది అంటే సినిమాలు, రాజకీయాలు, క్రికెట్, సాహిత్యం మరియు టెక్నాలజీ మొదలగు వాటికి విడి విడి బ్లాగులు. అలా కాకపోతే మన బ్లాగులు ఒక కలగూరగంపగా అయిపోయి ఫలానా బ్లాగు దేనికి సంబంధించింది లేక ఏ విషయం గురించి విషయాలను తెలియజేస్తుంది అంటే చెప్పటం కష్టమైపోతుంది ఆ విధంగా మన బ్లాగు వందలాది బ్లాగుల్లో ఏదో ఒకటి అయిపోతుంది అలాగే మన బ్లాగు ప్రాధాన్యతను/విశేషతను మనమే తగ్గించుకున్నట్లు అవుతుందేమో ఆలోచించండి. ఇది అన్ని బ్లాగులకు వర్తింపజేయాలి అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు సుమా కానీ కనీసం ఇప్పటివరకు లేక ఇకముందు ఏ బ్లాగులయితే ఒకే ఒక ప్రధానమైన విషయంపై చాలా ఎక్కువగా టపాలను వ్రాస్తున్నాయో మరియు ఎవరైతే ఎంతో శ్రమ కోర్చి లేక ఇతరుల వ్యాఖ్యలు/అభిప్రాయాలతో వారి రచనా శైలిని మెరుగుపరచుకోవటమో లేక నలుగురికీ వారి రచనలు/టపాలు చేరాలనుకుంటారో కనీసం వారివరకైనా ఇది అమలు చేస్తే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుందేమో...
నచ్చిన బ్లాగులు/టపాలను నలుగురికీ తెలియజేయడం:
మనం ప్రతి రోజూ చదివే టపాలలో మనకు నచ్చిన టపాలు ఉండి ఉంటే కొంచెం ఓపిక చేసుకొని వాటిని నలుగురికి తెలియజేయటానికి దయచేసి ప్రయత్నం చేయండి. మన ఈ ప్రయత్నం వలన కనీసం ఒక్కరికైనా మనం ఎన్నో ఆణిముత్యాల లాంటి బ్లాగులను/టపాలను పరిచయం చేయగలిగితే మన ప్రయత్నం సంపూర్తిగా సార్ధకమయినట్లే...ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే CBRao గారి దీప్తిధార బ్లాగులో అంతర్వీక్షణం మరియు OreMuna బ్లాగ్ లో నవంబర్ నెల బ్లాగ్ విశేషాలు ద్వారా కొంత మంది తమవంతు ప్రయత్నాలను బాగానే చేస్తున్నారు (నేను కూడా నా ఈ బ్లాగులో నచ్చిన బ్లాగులు మరియు టపాలు ద్వారా ఈ మహత్తర కార్యక్రమంలో ఒక భాగమని చెప్పుకోవటానికి కొంచెం గర్వంగా/సంతోషంగా ఉన్నది).....
ఒక్కసారి నేను పైన చెప్పిన నా టపాకు రాము గారి ద్వారా వచ్చిన వ్యాఖ్యను (ఎన్నొ సంవత్సరాల నుంచి నెట్ని చావగొడుతున్నా తెలుగు బ్లాగులు ఇన్ని వున్నయ్ అన్న విషయం ఈమధ్యే తెలిసింది. కళ్ళు తెరుచుకున్నయి. మీ బ్లగ్ కు సర్వధా రుణపడి వుంటాను.) చదివితే ఇలాంటి టపాలా వల్ల చాలా ఉపయోగం ఉంటుందనీ మరియు మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందిందనే అనిపిస్తుంది.
మీ గురించి పరిచయ వాక్యాలు :
మీ Blogger/Wordpress Profile లో సాధ్యమైనంత వరకు మీ గురించి అంటే వ్యక్తిగతం కాకుండా (ఒక వేళ చెప్పాలి అనుకుంటే అది మీ ఇష్టం) మీ అభిరుచులు, ఇష్టాలు-అయిష్టాలు, ఆశలు, ఆశయాలు, ఊహలు, నచ్చినవి (సినిమాలు, సంగీతం, పాటలు, ఆటలు), చదివినవి/చదువుచున్నవి(పుస్తకాలు,నవలలు, రచనలు) మొదలగునవి ఇస్తే మీ బ్లాగ్ కి వచ్చే పాఠకులు/చదువరలకు మీ గురించి కొద్దో గొప్పో తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే వారికి మీ టపాలలోని విషయాలపై మీకు ఉన్న పట్టు, ఉత్సాహం తెలుసుకునేలా చేయటం మీకు నిజమైన పాఠకులు/చదువరలను తీసుకు వస్తుంది మరియు వాళ్లను మీ బ్లాగ్ కి అను నిత్య పాఠకులను చేసే అవకాశం ఉంది కనుక ఒక 10-15 నిముషాలు సమయం తీసుకొని అయినా మీ Profile ని వెంటనే update చేయండి.
ఒకవేళ Blogger/Wordpress సమకూర్చిన Profile Page మీకు సౌలభ్యంగా లేదు అనుకుంటే GooglePages లో మీ ప్రతిభాపాటవాలను చూపించి సరికొత్త హంగులతో ముస్తాబు చేసి మీ పాఠకులతో మీయొక్క ఆ Page లంకె ను పంచుకోవచ్చు.
Rating :
ఇంతకు ముందు చాలా మంది ఆలోచించినట్టుగా, సలహా చెప్పినట్టుగా మనం మన టపాల గురించి పాఠకుల అభిప్రాయం మాటలలో కాకపోయినా కనీసం ఒక నొక్కు ద్వారా అయినా ఏదో ఒకటి తెలుసుకోవటం మంచిది అనుకుంటే మనం వెంటనే మన టపాలను Rate చేసే Widget ని వాడటం మొదలుపెట్టండి. నేను వెతకగా లభ్యమైన చాలా వాటిల్లో నాకు బాగా నచ్చిన Outbrain Widget (కొత్త ఖాతాతో పనిలేదు మరియు install చేయటం చాలా తేలిక) ను నా బ్లాగు టపాలకు ఇప్పటికే అనుసంధానించాను అది మీకు ఈ టపా చివరలో కనిపిస్తుంది.
ఒకవేళ ఇదే Widget మీకు కూడా నచ్చి మీరు కూడా దానిని మీ టపాలలో install చేయాలి అనుకుంటే దానిని ఇక్కడ నుండి download చేసుకోండి. ఒకవేళ మీకు ఆ పైన చెప్పిన Widget లో ఉన్న Stars కు బదులు వేరేవి ఉంటే బాగుంటాయేమో అనిపిస్తే మీరు ఇక్కడ నుండి వైవిధ్యమైన Stars లేక Classic Slider లాంటివి download చేసుకోవచ్చు. లేదూ మీలో ఎవరన్నా వీర Blogger అభిమానులు ఉండి, మాకు Stars బదులు Blogger గుర్తు ఉంటేనే మేము ఈ Rating Widget వాడతాము అనుకుంటే అలాంటి వాటిని కూడా ఇక్కడ నుండి download చేసుకోవచ్చు.
ప్రచారం చెయ్యటం :
ఇక వేరే Web Sites లో మన Blog Address ని publish చేస్తే (మనం కానీ లేక వేరే ఎవరైనా కానీ) ఆదరణ పెరిగి చదువరులు/పాఠకులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.( కాక పోతే ఇందులో ఉన్న సమస్య ఏమిటి అంటే కొంత మంది మీ బ్లాగ్ కి, మీ బ్లాగ్ అడ్రస్ ప్రచురించబడిన సైట్ కి లింకులు పెట్టేసి ( వేరే ఎవరికో మన టపా నచ్చి వారంతట వారే మనకు తెలియకుండా ఆ సైట్ లో ప్రచురించినా కూడా) ఏదైనా వ్యాఖ్య చేసినా కూడా అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోక ముందుకు సాగండి).
నాకు తెలిసిన కొన్ని సైట్స్ ఒక వేళ మీరు ప్రచారం చేయాలి అనుకుంటే :
అలాగే మనం మన వ్యక్తిగత బ్లాగులు, టపాలతో పాటు మన తెలుగు బ్లాగుల aggregators sites అన్నింటినీ ఇదే విధంగా పైన చెప్పిన sites లో ప్రచారం చేస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అవుతుందేమో ... ఆలోచించండి.
వ్యాఖ్యలు / అభిప్రాయములు :
దయచేసి మీ అత్యంత విలువైన సమయంలో నుంచి ఎంతో కొంత సమయాన్ని కేటాయించి, మీరు-మీ పాఠకులు పంచుకునే వ్యాఖ్యలు/అభిప్రాయాలు ఎల్లప్పుడూ సాధ్యమైనంత వరకు interactive గా ఉండేలా చూడండి. ఇది ఇప్పటికే మన తెలుగు బ్లాగుల్లో చాలా వరకు బాగానే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కాకపోతే ఇంకా కొంచెం మెరుగుపడవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎవరైనా మీ టపాకు సంబంధంలేని Technical Related Information గురించి అడిగినా మీకు తెలిసినంతలో వారికి సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి. ఒక వేళ మీకు సమాధానం తెలియక పోతే కనీసం తెలియదు అని చెప్పండి తద్వారా ప్రశ్న అడిగిన వారు ఇంకొక మార్గానా వారి సమాధానాన్ని వెదుక్కొనే ప్రయత్నం చేస్తారు ... అలాగే మీ మీద ఉన్న నమ్మకంతో (మీ టపాలు చదవగా లేక మీరు ఇతరులకు చేసిన సహాయం మీ వ్యాఖ్యల ద్వారా గానీ వారికి మీ పై ఏర్పడిన అభిప్రాయం కావచ్చు) మీ కోసం ఎదురు చూడరు మరియు లేక కొంచెం తీవ్రమైతే మీ మీదో, మీ బ్లాగ్ మీదో అకారణ ద్వేషం పెంచుకోరు(ఇలా జరగడం చాలా అరుదనే నేను అనుకొంటున్నాను).
ఒక్కొకసారి మనం ఎంతో కష్టపడి ఓపికగా అవతలి వారికి వారు అడిగిన Technical Help చేసినా కనీసం దానిని పట్టించుకున్న పాపానికి కూడా పోరు కనీసం మన వ్యాఖ్య - వాళ్ల బ్లాగ్ లో అయినా లేక అదే మన వ్యాఖ్య మన బ్లాగ్ లో వారు అడిగిన చోట చెప్పినా సరే చూసాము/చదివాము అనో తరువాత వీలు చూసుకొని వాటిని follow అయ్యి ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతాము అని అన్నా చెప్పరు...కానీ అదే వేరే ఎవరన్నా మీరు రాసింది మనసుకి భలే హత్తుకుంది అంటే వెంటనే నెనర్లు అంటూ బయలదేరుతారు......దీనికి ఉదాహరణ మన శ్రీనివాసమౌళి . అలాగే మనం చేసిన సహాయం కొంచమే అయినా వెను వెంటనే తమ బ్లాగ్స్ లో ధన్యవాదాలు తెలిపే విశాఖతీరాన, ap2us లాంటి మంచి వారు, మన సైట్ కే వచ్చి 'మీ దయవల్ల నేనూ టెంప్లేటు మార్చాను...మీరు template master ఆ, హ హ..3columns ki' అనే Comment చెప్పే బూదరాజు అశ్విన్ గారి లాంటి మంచి వాళ్లు కూడా ఉంటారు.......కనుక ఒకటో రెండో ఎదురు దెబ్బలు తగిలినా Comments కి Respond చెయ్యండి.
మన తెలుగు బ్లాగర్స్ కు ఉన్న ఇంకొక ముఖ్యమైన జాడ్యం ఏమిటి అంటే ... ఏదైనా ఒక బ్లాగుకి వచ్చి ఏదో ఒక వ్యాఖ్య రాయటం ఇంక దానికి వచ్చే ప్రతిస్పందన గురించి పట్టించుకోకుండా వెళ్లిపోవటం .... ఇంతకు ముందు అయితే మీరు వ్యాఖ్య వ్రాసిన ప్రతి బ్లాగుని గుర్తు పెట్టుకోవటం కష్టమని సరిపెట్టుకోవచ్చు గానీ .. Blogger లో వ్యాఖ్యల Page లో కొత్తగా వచ్చిన 'Email follow-up comments to 'your email address' అనే Checkbox ని select చేసుకుంటే ఆ టపా కు సంబంధించి మీ వ్యాఖ్య తదుపరి వచ్చే వ్యాఖ్యలన్నీ మీ Email కే direct గా వస్తాయి కనుక మీరు ప్రతిసారి ఆ బ్లాగుకి వెళ్లి ఆ టపాయొక్క వ్యాఖ్యలను చూడవలసిన లేదా మీ వ్యాఖ్యకు (ప్రతి)స్పందన వచ్చిందా అని వెదకవలసిన అవసరం లేదు కనుక దయచేసి ఇక ముందు అయినా ఆయా వ్యాఖ్యల పేజీలను సాధ్యమైనంతవరకు interactive గా ఉంచటానికి ప్రయత్నం చేయండి.
ఒకవేళ మీ బ్లాగుకు వచ్చే పాఠకులకు వ్యాఖ్య వ్రాసే సమయం లేక లేదా తెలుగులో వ్రాయటం తెలియకనో లేదా వ్యాయటం కష్టమనో ... మరీ ముఖ్యంగా మీరు వారికి 'Pre Defined Text for Comments' ఇవ్వాలి అనుకుంటే మీరు మీ బ్లాగ్ లోకి Login అయిన తరువాత Settings పేజ్ కి వెళ్లి ... Comments అనే Tab మీద నొక్కి అదే Page లో కింద కనిపించే 'Comment Form Message' text box లో ఈ కింద ఇచ్చిన వాటిని (లేదా మీరు మీ పాఠకులకు ఎలాంటి Text ఇవ్వాలి అనుకుంటే అది) Copy/Paste చేయండి.
కెవ్వు:కేక:సూపర్:డూపర్:అదిరింది ::: మేము మీ బ్లాగాభిమానులమైపోయాము(10 out of 10)
చాలా బాగా ఉంది .. నాకు నచ్చింది :: నలుగురికీ చెప్పదగిన బ్లాగు/టపా(6 to 9 out of 10)
ఫర్వాలేదు ... అంత సూపర్ గానూ లేదూ అలాగని దరిద్రంగానూ లేదు (5 out of 10)
బాగోలేదు ... నాకు నచ్చ లేదు (1 to 4 out of 10)
పరమ చెత్తగా ఉంది ... సమయం వృధా (0 out of 10)
పైన పేర్కొన్న విధంగా చేసి మీ సెట్టింగ్స్ సేవ్ చేసుకొని ఉంటే, మీ టపాలలో ఎవరైనా వ్యాక్యల లంకె నొక్కినప్పుడు, ఆ వ్యాఖ్యల్ పేజ్ ఈ క్రింద ఇమేజ్ లోని విధంగా కనపడుతుంది.
ఒకవేళ మీ పాఠకులకు పైన ఉన్న వాటిల్లోంచి కనీసం Copy/Paste చేసే ఓపిక/సమయం ఉన్నవారు అయితే తమ వ్యాఖ్యలు/అభిప్రాయములు ఈ విధంగా తెలియజేయడం తేలిక అవుతుంది....అసలు లేని దానికన్నా ఏదో ఒక సులభమైన అవకాశం పాఠకునికి ఇవ్వగలం కదా అన్నదే నా ఈ ఆలోచన వెనకున్న ఉద్దేశ్యం.
మీ వ్యాఖ్యల పేజ్ లో నుండి 'Word Verification' ను తీసివేయటానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా సార్లు ఆ అక్షరాలు/సంఖ్యలు అంత తేలికగా అర్ధమయ్యేటట్లుగా ఉండవు మరియు ఒకవేళ ఉన్నా అవి Enter చేయడం ఒక పెద్ద సమస్య లాగా కూడా మీ పాఠకులకు అనిపించవచ్చు....మరో ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ 'Word Verification' Option ఇవ్వటం అనేది ఆంగ్ల బ్లాగుల్లో(సైటుల్లో) ఏదో ఒక S/W Program ఉపయోగించి మూకుమ్మడిగా వందల/వేల వ్యాఖ్యలను ప్రచురింపజేయటానికి (నూతన ఖాతాలను తయారుచేయటానికి) చేసే ప్రయత్నాలను prevent చేయటానికి కానీ మన తెలుగు బ్లాగులగు ఇంకా అలాంటి సమస్య స్థాయికి రాలేదు కనుక.
మీ వ్యాఖ్యల పేజ్ ని Popup లో చూపించకుండా ఉంటే మంచిది ఎందుకంటే చాలా మంది పాఠకుల Computers లో 'Popup Blocker' ఉంటుంది అది ఆ పేజ్ ని Block చేయచ్చు. అదీ కాక కొన్ని Systems లో Popup Size చాలా తక్కువగా ఉండి వ్యాఖ్యలు చదవ(రాయ)టానికి చాలా కష్టపడవలసి వస్తుంది.
Feedburning :
మనం మన బ్లాగులో ఉన్న టపాలను (ఒకటో, రెండో ఉంటే ఫర్వాలేదు గానీ .. పదులో, వందలో ఉంటే) మన పాఠకులకు సులభమైన లేదా వైవిధ్యంగా లేక కొత్త రకంగా చేరువ చేయాలి అనుకుంటే మీరు Feedburner లేక Feedblitz వాడండి.
ఇలా చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే .... ఈ క్రింద చూపినట్లుగా మీకున్న Options లో చాలా ముఖ్యమైనవి మీరు ఏ విధంగా మీ పాఠకులకు అందించాలి అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మార్చండి. ఉదాహరణకు మీ ఫీడ్ లో ఎన్ని టపాలు చూపించాలి, మీ టపా పూర్తిగా చూపించాలా లేక మొదటి 20, 50, 100 పదాలు చూపించాలా మరియు టపాలను కొత్త Window లో ఓపెన్ చేయాలా లేక Current Window లో ఓపెన్ చేయాలా మొదలగునవి.
పై విధంగా చేసిన తరువాత మీ టపాలను మీ పాఠకులు తరచుగా వాడే 'Feed Readers' అంటే Yahoo, Google, NetVibes, BlogLines మరియు PageFlakes మొదలగునవి ద్వారా చదివే అవకాశాన్ని కల్పించండి ఉదాహరణకు నా బ్లాగు Header లో Page Element ఉన్న Images చూడండి.
ఒకవేళ మీ బ్లాగుకు Email Subscribers ఉండి ఉంటే వారి వివరాలు మీరు వాడుచున్న 'Feedburner' లేక 'Feedblitz' లో కనిపిస్తాయి కనుక మీరు ఆయా Emails కు వారానికో, నెలకో ఒక సారి వారికి ఒక News Letter లాగా పంపించి అందులో మీరు కొత్తగా వ్రాసిన టపాలను చదవమని చెప్పవచ్చు. దయచేసి దీనిని misuse చేయవద్దు అంటే వారికి ప్రతిరోజూ Email పంపించకండి మరియు వాటిని బయట ఎక్కడా publish చేయకండి.
ఒక వేళ మీరు ఇంకా సులభంగా చేయాలి అనుకుంటే JavaScript based Feed కూడా తయారుచేసుకోవచ్చు. దీనిని నా బ్లాగులో మీరు చాలా సార్లు చూసే ఉంటారు ... అవేనండి నా టపాలలో దిగువన నా అన్ని టపాల టైటిల్స్ తో కనిపించేవి - ఉదాహరణకు ఈ క్రింద ఉన్నImage ను చూడండి.
మీరు కూడా ఇలాంటిది తయారుచేసుకోవటానికి ఇక్కడ నొక్కండి. ఇలాంటి ఫీడ్ తయారుచేసుకొనేటప్పుడు మనకు ఎలాంటి Options ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే క్రింద ఉన్న Image ని చూడండి.
ఒకవేళ మీరు Blidget (Blog Widget) రూపంలో మీ బ్లాగులో ఉన్న టపాలను చూపాలి అనుకుంటే మీరు Wiidgetbox Blidget లేక SpringWidget's Express Widget నుండి ప్రయత్నించండి.
Blidget మరియు Feedburning options కు మీరు statistics చూసుకునే అవకాశం ఉన్నది. అలాగే ఈ పైన చెప్పిన Options అన్నీ మీకు నచ్చిన ఏ బ్లాగుకైనా apply చేసి ఆ ఫీడ్స్ ను మీ బ్లాగులో చూపించటం ద్వారా వాటికి మంచి publicity చేయవచ్చు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే ... మీరు మీ బ్లాగుల్లో Widget(s) ఎక్కువగా వడితే Page Loading Time కొంచెం ఎక్కువగా ఉంటుంది.
Popular/Top Posts :
మనం మన బ్లాగులో ఉన్న టపాలను (ఒకటో, రెండో ఉంటే ఫర్వాలేదు గానీ .. పదులో, వందలో ఉంటే) మన పాఠకులకు వాటిని తెలియజెప్పటానికి ఈ Popular/Top Posts అనే Option ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ మీరు WordPress ఉపయోగిస్తున్నట్లైతే మీకు మీ బ్లాగు Dashboard లో ఉన్న 'Popular/Top Posts' Widget గురించి తెలిసే ఉంటుంది లేదూ తెలియదంటే క్రింద ఉన్న Image ద్వారా ప్రయత్నించండి.
నాకు తెలిసినంతలో Blogger ఉపయోగించే వారికి దురదృష్టవశాత్తు మన బ్లాగు Dashboard లో ఇలాంటి సౌలభ్యం లేదు కనుక simple గా ఇలాంటిది చెయ్యాలి అంటే మీ Blog Layout నుండి 'List' అనే ఒక కొత్త Page Element అని జత చేయండి. అప్పుడు దానిలో మీ బ్లాగులో, పాఠకులకు లేదా మీకు నచ్చిన టపాలను, వాటి లంకెలను ఒక పది, పదిహేను వరకు జతచేసుకుంటూ వెళ్లండి. మీ ఓపిక/ఉత్సాహాన్ని బట్టి ఈ లిస్ట్ ని వారానికో, నెలకో ఒకసారి మార్చుకుంటూ వెళ్లండి. అలాగే వీలుంటే లేక ఉత్సాహం ఉంటే మీకు నచ్చిన ఇతరుల బ్లాగు టపాలకు కూడా ఇలాగే చేయవచ్చు.
పైన చెప్పినది సాధించటానికి ఇంకొక మార్గము ఏమిటి అంటే ... మీకు నచ్చిన టపాలన్నింటినీ (మీ బ్లాగులోవి లేక మీకు నచ్చిన ఇతర బ్లాగుల్లోవి) మీకు నచ్చిన Bookmarking Site(s) కు జతచేసుకొని అక్కడ వారు provide చేసే RSS Feed ను మీ బ్లాగులో ఒక Page Element కి జతచేసినచో ఆ టపాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి.
ఇలా కాక మీకు One Time Solution అంటే ఏదో ఒక Widget లాగా ఉండి అదే automatic గా మన బ్లాగులో ఏ టపాలు ఎక్కువగా చదవ(వీక్షించ)బడ్డాయో వాటిని చూపిస్తే చాలు అనుకుంటూ అంటే మీరు Spotplex Widget లేదా AffiliateBrand's Widget ద్వారా గానీ దానిని సాధించవచ్చు.
0 comments:
Post a Comment