Saturday, May 21, 2011

ఫోటోషాప్ లో EXTRACT ఫిల్టర్ ను వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి సింపుల్ గా రిమూవ్ చెయ్యడం – ఫోటోషాప్ ట్యుటోరియల్

మామూలుగా చాలా మంది ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యడానికి లాసో టూల్స్ ని గానీ లేదా పెన్ టూల్ ని గాని వాడుతుంటారు.వీటితో పని శ్రమ మరియూ కొంచెం కష్టం తో కూడుకున్న పనే..కానీ మనం అలా కాకుండా ఇమేజ్ ని కట్ చెయ్యడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఫోటోషాప్ లో ఉంది.అదే Extract ఫిల్టర్.ఇప్పుడు మనం పైన చెప్పుకున్న Extract ఫిల్టర్ ని వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి ఎలా సులభంగా కట్ చెయ్యాలో తెలుసుకుందాం…










మొదట ఏదైనా ఇమేజ్ ని ఫోటోషాప్ లో ఓపెన్ చెయ్యండి..


1



ఇప్పుడు ఫిల్టర్ మెనూలోని Extract ను క్లిక్ చెయ్యండి..




2



వెంటనే క్రింద విధంగా ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది..ఒక సారి క్రింద విండోలోని టూల్స్ పేర్లు కూడా గమనించండి.



4



ఇప్పుడు Edge Highlighter Tool ని ఉపయోగించి ఏ భాగాన్నయితే కట్ చెయ్యాలనుకున్నారో ఆ భాగం చుట్టూ క్రింద విధంగా స్టార్టింగా పాయింట్ మరియూ ఎండింగ్ పాయింట్ కలిసే విధంగా పాత్ గీయండి.ఒక వేళ అవసరమయితే బ్రష సైజ్ తగ్గించుకుని బ్రష్ చెయ్యండి.


5



ఇప్పుడు Fill tool ని వాడి ఈ క్రింద విధంగా పాత్ లోపల క్లిక్ చెయ్యండి.వెంటనే మీరు గీసిన పాత్ లోపల కలర్ ఫిల్ అయ్యి క్రింద విధంగా కనిపిస్తుంది.ఒక వేళ కలర్ గనుక పూర్తిగా కాన్వాస్ మీద స్ప్రెడ్ అయితే మీరు పాత్ ని గీసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ను ఎండింగ్ పాయింట్ కు సరిగా కలపనందువల్ల అయ్యి ఉండవచ్చు.మళ్ళీ మధ్యలో ఎక్కడ బ్రష్ లింక్ కట్ అవ్వకుండా చూసుకోండి.



6




ఇప్పుడు Preview బటన్ ని క్లిక్ చేసి ఇమేజ్ మీకు నచ్చినట్లు వస్తే  Ok నొక్కండి..ఒక వేళ ఇమేజ్ లో ఎక్కడైనా సరిగా రాకపోతే Eraser Tool ని వాడి జాగ్రత్తగా ఏ ఏ ప్రదేశాల్లో సరిగా రాలేదో అక్కడ ఎరాజ్ చేసి ఫిల్ టూల్ ని వాడి ఫిల్ చేసి.ప్రివ్యూ చూసి నచ్చితే ఒకే చెయ్యండి.



7



ఇప్పుడు ఇమేజ్ బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యబడి క్రింద విధంగా కనిపిస్తుంది..


8



అంతే అయిపోయింది.దీన్ని మీ ఇష్టం వచ్చిన బ్యాగ్రౌండ్ ఇమేజ్ మీదకి డ్రాగ్ చేసి నచ్చినట్టు సెట్ చేసుకోండి.


నా ఫైనల్ రిజల్ట్….



9

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...