Tuesday, May 24, 2011

ఈ-వేలం ద్వారా(ఆన్‌లైన్‌లో అమ్మకాలు.)

వివిధ కంపెనీల ఉత్పత్తులను ఈ-వేలంలో కొనుగోలు చేసి, వాటిని సరైన ధరకు అమ్మడం కూడా లాభసాటి వ్యాపారమే. రూపాయి పెట్టుబడి లేకుండా -‘ఈ’ తరహా వ్యాపారానికి ఇంటర్నెట్‌లో ఎన్నో మార్గాలు. ఇదే ఆదాయమార్గంగా మలచుకున్న వాళ్లూ ‘ఈ’రంగంలో ఎక్కువే. సెడూ.కో.యుకె, ఆఫ్టర్నిక్.కామ్,(www.afternic.com) ఈబే.కామ్ ‌లాంటి సైట్లను తరచూ చూస్తే విషయం మీకే అర్థమవుతుంది
                     ఇది కొంచెం టెక్నిక్‌ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్‌ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్‌ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్‌ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్‌, ఐఆఫర్‌(www.ioffer.com), అమె జాన్‌, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్‌ అనే ఆన్‌లైన్‌ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి..
Caution: కాకపోతే, ఈవిధమైన వ్యాపారానికి సరైన సైట్ ఎంచుకోకుంటే ఇబ్బందులు లేకపోలేదన్న ఫిర్యాదులూ ఉన్నాయి. జాగ్రత్త!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...