Monday, April 11, 2011

Trashmail - ఒక ఉచిత డిస్పోసబుల్ ఈ-మెయిల్ సర్వీస్!!!

మనం కొన్ని సైట్లను సందర్శించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు మన ఈ-మెయిల్ ఐడీ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది, అలా ఇవ్వటం ద్వారా ఆ సైట్ నుండి మన మెయిల్ ఐడీ కీ మెయిల్స్ వస్తూ ఉంటాయి. అవసరమైతే సరే కానీ అనవసరమైనవే చిరాకు కలిగిస్తాయి. అలా కాకుండా ఆయా సైట్ల లో మన రియల్ మెయిల్ ఐడీ కి బదులుగా టెంపరరీ మెయిల్ ఐడీ అదే కొంతపరిమిత కాలంపాటు పనిచేసే డిస్పోసబుల్ మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే బాగుంటుంది కదా!!. అటువంటి డిస్పోసబుల్ మెయిల్ సర్వీస్ ని Trashmail మనకు అందిస్తుంది, అదీ ఉచితంగా. దాని కోసం Trashmail సైట్ కి వెళ్ళి New disposable email address: దగ్గర డిస్పోసబుల్ ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యాలి. Your real email address: దగ్గర మన రియల్ ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యాలి అలా ఎంటర్ చెయ్యటం వలన డిస్పోసబుల్ ఈ-మెయిల్ ఐడీ వచ్చిన మెయిల్స్ మన రియల్ ఐడీ కి ఫార్వార్డ్ చెయ్యబడతాయి. Number of forwards, Life Span ( డిస్పోసబుల్ ఈ-మెయిల్ ఐడీ కాలపరిమితి) తదితర వివరాలు ఎంటర్ చేసి Create Disposable email address బటన్ పై క్లిక్ చెయ్యాలి.


వెబ్ సైట్: Trashmail

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...