Monday, April 11, 2011

ఆన్ లైన్ లో ఫైల్స్ షేర్ చెయ్యటానికి వెబ్ సైట్లు!!!

అంతర్జాలం లో ఉచితంగా ఫైళ్ళు షేర్ చెయ్యటానికి చాలా వెబ్ సైట్లు ఉన్నాయి, కొన్ని సైట్లలో అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే ఫైల్స్ జస్ట్ డ్రాగ్-అండ్-డ్రాప్ చెయ్యగా వచ్చిన లింకు అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫైల్ పరిమిత సమయం వరకు ఫైల్ ఆయా సైట్ల లో ఉంటుంది, ఆ సమయం లోనే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి ఫైల్స్ షేర్ చెయ్యటానికి ఉపయోగపడే కొన్ని క్రొత్త సైట్లు:

౧.Crate

ఈ సైట్ లో 50 MB ఫైల్స్ సైజ్ వరకు సైట్ లో డ్రాగ్-అండ్-డ్రాప్ చేస్తే షార్టెన్డ్ URL వస్తుంది దానిని కాపీ చేసుకొని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే 200MB స్టోరేజ్ స్పేస్ వస్తుంది.



౨. GE.TT

ఇది మరొక సింపుల్ రియల్-టైమ్ షేరింగ్ సైట్, పైన చెప్పినట్లుగానే ఈసైట్ లో కూడా ఫైళ్ళ ను డ్రాగ్-అండ్-డ్రాప్ చేస్తే షార్టెన్డ్ URL వస్తుంది దానిని కాపీ చేసుకొని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు.


౩.Min.us

ఈ సైట్ లో డాక్యుమెంట్ల తో పాటు వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు.


ఆల్ ది బెస్ట్ ఫర్ టీం ఇండియా!!!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...