నెట్ లో ఇమేజ్ లను సెర్చ్ చెయ్యటానికి జెనెరల్ గా గూగుల్ ఇమేజెస్ లో సెర్చ్ చేస్తూ ఉంటాం. Google Image Slideshow అనే వెబ్ సర్వీస్ ద్వారా మనం సెర్చ్ చేసిన ఇమేజ్ లను స్లైడ్ షో చూడవచ్చు. దీనికోసం మన చెయ్యవలసిందల్లా http://www.googleimageslideshow.com/ సైట్ కి వెళ్ళి మనం వెతకవలసిన క్వరీ ని సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి ’Enter' కీ ప్రెస్ చెయ్యటమే. స్లైడ్ షో పై మౌస్ పాయింటర్ ని ఉంచటం ద్వారా స్లైడ్ షో కి సంబంధించిన కంట్రోల్ బటన్స్ ని క్రింద మరియు కుడి చేతి పై భాగం లో చూడవచ్చు. స్లైడ్ షో వేగాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
స్లైడ్ షో ని కస్టమైజ్ చేసే సదుపాయం కూడా ఉంది, దాని కై ’Advanced' టాబ్ పై క్లిక్ చెయ్యాలి.
వెబ్ సైట్: Googleimageslideshow
0 comments:
Post a Comment