Wednesday, April 13, 2011

మెయిల్ నుండి మొబైల్ కు మెసేజ్ (SMS) పంపటం ఇలాగ

మనం gmail లేదా Yahoomail నుండి మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు పంపటం చాలా తేలిక. సాధారణంగా మొబైల్ కు మెసేజ్ లను పంపడానికి way2sms.com లేదా 160by2.com వంటి సైట్ లను వాడుతుంటాం. కొన్ని కారణాలవల్ల అప్పుడప్పుడు అవి ఓపెన్ అవ్వవు. అటువంటప్పుడు మనం gmail లేదా yahoomail నుండి కూడా మెసేజ్ లను పంపవచ్చును. కాని ఇలా పంపడానికి తప్పనిసరిగా 160by2.com లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

మెయిల్ లో (ఏదయినా) కంపోజ్ మెయిల్ చేసిన తరువాత To (పంపవలసిన ఐడి) ప్రాంతంలో మెసేజ్ స్వీకరించే వారి "మొబైల్ నంబరు@160by2.com" అని టైప్ చెయ్యాలి. తర్వాత Subject ప్రాంతంలో మీ 160by2.com లోని ఐడిని (or your registered Phone Number) టైప్ చెయ్యాలి. తర్వాత సమాచారం వ్రాయవలసిన ప్రాంతంలో సమాచారాన్ని వ్రాసి send నొక్కాలి. అంతే ........ మీరు పంపిన సమాచారం sms రూపంలో చేరవలసిన వ్యక్తికి చేరుతుంది.


Yahoomail ద్వారా కూడా మొబైల్ కు 160by2.com ప్రమేయం లేకుండా పంపవచ్చును కాని అచట చిన్న limitation ఉండటం వలన మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేమిటంటే ప్రతి 5 smsలు yahoomail నుండి పంపిన ప్రతిసారి receiver నుండి కనీసం ఒక రిప్లై రావాలి. రిప్లైకి ఒక్కో ఆపరేటర్ ఒక్కోవిధంగా చార్జ్ చేస్తారు కాబట్టి 160by2.com ద్వారా sms పంపటం ఉత్తమం మరియు చాలా సులభం.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...