Saturday, October 23, 2010

Ctrl+Alt+Del ఎవరు కనుగొన్నారో తెలుసా?


కంప్యూటర్ హ్యాంగ్ అయినప్పుడు అందరూ సహజంగా ఉపయోగించే చిట్టచివరి ప్రయత్నం కీబోర్డ్ నుండి Ctrl+Alt+Del కీలను ప్రెస్ చేసి కంప్యూటర్ ని రీస్టార్ట్ చేయడం! ప్రతీ కంప్యూటర్ వినియోగదారుడికీ తెలిసిన ఈ సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ని ఎవరు కనుగొన్నారో తెలుసా? 1980వ సంవత్సరంలో "డేవిడ్ బ్రాడ్లే" అనే ఐబియం ఉద్యోగి కంప్యూటర్ ప్రతిస్పందించడం మానేసినప్పుడూ, ఇక ఎలాంటి కమాండ్లను స్వీకరించకుండా నిలిచిపోయినప్పుడు సులువుగా సిస్టం ని రీస్టార్ట్ చేయడానికి మార్గం ఒకటి కనుగొనాలన్న ఉద్దేశంతో ఒక చిన్న సోర్స్ కోడ్ ని రాశాడు. ఈ కోడ్ రాయడానికి అతనికి పట్టిన సమయం కేవలం ఒక నిముషం 23 సెకండ్లు మాత్రమే! అంత తక్కువ టైము పడితేనేం.. ఇన్నేళ్లు గడిచినా ఆ మూడు అక్షరాల తారక మంత్రానికి తిరుగే లేకుండా పోయింది. బ్రాడ్లే ఇంకా అనేక అంశాలను కనుగొన్నప్పటికీ Ctrl+Alt+Del మాత్రం అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ఆ షార్ట్ కట్ ని తన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉపయోగించడం మొ

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...