Ex: : బ్లాగుల కోసం, సరదా కోసం సృష్టించేవి కొన్నయితే వ్యాపార దృష్టితో, బ్రాండు ప్రచారం కోసం, క్రయ విక్రయాల కోసం సృష్టించేవి ఇంకొన్ని.అయితే మన వెబ్‌సైట్ గురించి మనకెంత తెలుసు ? వెబ్‌సైటుని సృష్టించి అందులో కంటెంటు పెట్టడంతోనే మన పనయిపోయిందా ?కాదు. దానిని సమర్థంగా నిర్వహించాలంటే మన వెబ్‌సైటు గురించి మరింత సమాచారం మనం తెలుసుకోవాలి. దానికి వెబ్ అనలిటిక్స్‌ని ఉపయోగించుకోవాలి.
అయితే వెబ్ అనలటిక్స్‌లో ముఖ్యమయినది సమాచారం ఒక్కటే కాదు.సేకరించిన సమాచారాన్ని సరిగా అనాలసిస్ చేయడం, ఆ సమాచారాన్ని అనాలసిస్ చెయ్యడానికి సరయిన ఉపకరణాలున్నాయి, దానిని అనాలసిస్ చెయ్యడానికీ ఉన్నాయి కానీ దానిని సరిగా అన్వయించి మన వెబ్‌సైటుకి తగిన మార్పులు చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే.
ప్రతీ వెబ్‌సైటు స్థాపనకీ ఒక గోల్ ఉంటుంది. అది ఇన్ని వస్తువులని అమ్ముకోవడం అని కావచ్చు, ఇంత మంది సందర్శకులు కావచ్చు, ఇంకేదయినా కావచ్చు. మన వెబ్‌సైట్ మనకి కావలసినట్టుగా పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి మనం ఈ అనలటిక్స్ ఉపకరణాలని ఉపయోగించి, అవి అందించిన సమాచారాన్ని బేరీజు వేసుకుని తగిన మార్పులు చేసుకుని మన గోల్‌ని అందుకోవాలి.
అసలు ఈ అనలటిక్స్ ఉపకరణాలు ఎలాంటి సమాచారాన్నందిస్తాయి. వాటికి అర్థం ఏమిటి అనే అవగాహన పెంచుకోవడం ముఖ్యం. కొన్ని ముఖ్యమయిన వాటి గురించి చెబుతాను.
యునీక్ విజిటర్స్: పైన చెప్పుకున్న పేజ్‌వ్యూస్ తో ఒక చిక్కు ఉంది. అది మీ పేజీలు ఎన్ని సార్లు చూడబడుతున్నాయో చెబుతుంది కానీ మీ సైటుకి ఎంత మంది వస్తున్నారనేది చెప్పదు. అది తెలుసుకోవడానికే యునీక్ విజిటర్స్.
పేజ్‌వ్యూస్: మీ వెబ్‌సైటులోని పేజీలను ఇప్పటిదాకా ఎంతమంది సందర్శించారో దీని వల్ల తెలుస్తుంది. మీ వెబ్‌సైటు ఎంత ప్రాచుర్యం పొందితే అంత ఎక్కువ పేజ్‌వ్యూస్ కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది.
రెఫరర్: మీ వెబ్‌సైటుకి జనాలు ఎక్కడ నుంచి వస్తున్నారో ఇది చెబుతుంది. ఉదా: తెలుగు బ్లాగులని తీసుకుంటే కూడలి నుంచి వస్తారు, గూగుల్ సెర్చ్ నుంచి వస్తారు, జల్లెడ నుంచి వస్తారు, మీ స్నేహితులయిన ఇతర బ్లాగుల నుంచి వస్తారు.మరి ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నారు అని చెప్పేది రెఫరర్.ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీ సైటుకి వచ్చే జనాలను పెంచుకోవాలంటే మీ రెఫరర్‌ల మీద ఇంకా ఎక్కువ దృష్టి సారించాలి మరి.
బౌన్స్ రేట్: సాధారణ పదాలతో చెప్పుకోవాలంటే ఒక సందర్శకుడు మీ వెబ్‌సైటుకి వచ్చి ఒక్క పేజీనే చూసి వెళ్ళిపోవడం, లేదా ఇతర వెబ్‌సైటులకి వెళ్ళిపోవడాన్ని బౌన్స్ అంటారు.ఇది ఎందుకు ముఖ్యం అంటే మీ వెబ్‌సైటు, అందులోని సమాచారం ఎంత ఆసక్తికరంగా ఉందో దీని వల్ల తెలుసుకోవచ్చు. ఒక సందర్శకుడు మీ వెబ్‌సైటుకి వచ్చి ఒక పేజీ చూస్తే మిగతా పేజీలను చూసేంత ఆసక్తికరంగా ఉందా అందులోని సమాచారం, ఆ సమాచారాన్ని చెప్పిన తీరు అని దీని వల్ల బేరీజు వేసుకోవచ్చు.
కన్వర్షన్ రేట్: వెబ్‌సైట్ స్థాపించడానికి ప్రతీ ఒక్కరికీ ఒక గోల్ ఉంటుంది. ఉదా: ఒక కొనుగోలు సైటు ఉందనుకోండి. మన సైటుకి వచ్చే సందర్శకుడు ఒక కొనుగోలు చేస్తే అది కన్వర్షన్. ఇది చాలా ముఖ్యమయిన మెట్రిక్. ఎందుకంటే మీ సైటుకి వచ్చే వాళ్ళలో ఎంత మంది కొనుగోళ్ళు చేస్తున్నారో దీని వల్ల తెలుస్తుంది.మీరు ఉదా: మీ వెబ్‌సైటుని గూగుల్ ఆడ్‌వర్డ్స్‌లో ప్రచారానికి ఉంచారనుకోండి లేదా SEO టెక్నిక్కులు వాడి మీ వెబ్‌సైటుని మెరుగు పరచారనుకోండి, దాని ద్వారా సందర్శకుల సంఖ్య పెరిగిందా ? వచ్చే సందర్శకులు ఎక్కువ కొనుగోళ్ళు చేస్తున్నారా ? వంటివి చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఖర్చు పెడుతున్న డబ్బుకి ROI వస్తుందా లేదా అని తెలుసుకోవాలి కదా మరి.దీనిని కనుగొనడానికి అనలిటిక్ ఉపకరణాలలో ఏర్పాటు ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్‌లో గోల్స్ అని ఉంటాయి. దాని ద్వారా దీనిని కనుగొనవచ్చు.
సెగ్మెంటేషన్: సెగ్మెంటేషన్ మీరు సేకరించిన సమాచారాన్ని వివరించడానికి చేసే ప్రక్రియ.ఉదా: మీ వెబ్‌సైటుకి ఎంత మంది భారతం నుంచి వస్తున్నారు, ఎంత మంది ఇతర దేశాల నుంచి వస్తున్నారు.ఎంత మంది విండోసు వాడుతున్నారు, ఎంత మంది లినక్సు వాడుతున్నారు.ఎంత మంది కొత్త సందర్శకులు, ఎంత మంది పాత సందర్శకులు ఒక రోజులో వస్తున్నారు.ఏ రకమయిన టపాలకి ఎంత మంది సందర్శకులు వస్తున్నారు.
ఇలాగన్నమాట.
ఇలాగన్నమాట.
హీట్ మాప్: మీ వెబ్‌సైటులో ఏ స్థలాలను సందర్శకులు ఎక్కువగా వీక్షిస్తున్నారు ? ఏ ప్రదేశాలకు ఎక్కువ నొక్కులు ఉంటున్నాయి లాంటి వివరాలు హీట్ మాప్ ద్వారా తెలుస్తాయి.దీనిని crazy egg లాంటి ఉపకరణాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఎంట్రీ పేజ్/ఎక్సిట్ పేజ్: మీ వెబ్‌సైట్‌ని సందర్శకులు ఏ పేజీ ద్వారా సందర్శిస్తున్నారు, ఏ పేజీ ద్వారా వెళ్ళిపోతున్నారు అనేది ఎంట్రీ/ఎక్సిట్ పేజ్ ద్వారా తెలుస్తుంది.
పైవన్నీ ఏమిటో తెలుసుకోవడమే కాక మన వెబ్‌సైట్‌లకి ఆపాదించుకుని, వాటిలోనుంచి అవసరమయిన సమాచారాన్ని తీసుకుని తగిన మార్పులు చేసుకోవాలి. ఇప్పుడున్న ఉచిత ఉపకరణాలలో ఇవన్నీ తేలికగా తెలుసుకోవడానికి ఉపయోగపడేది గూగుల్ అనలటిక్స్.దీనిని మీ వెబ్‌సైటుకి అనుసంధానిస్తే పైన చెప్పిన అన్ని వివరాలనూ మీకు అందిస్తుంది. ఇవే కాక మీకు కావలసిన విధంగా సమాచారాన్ని బేరీజు వేసుకునే అవకాశం కూడా కొంత వరకూ అందిస్తుంది.
1 comments:
thank u nice information
Post a Comment