Thursday, June 2, 2011

BLOG TRICKS


మొదటిది MyBlogLog. ఇది ఇప్పుడు Yahoo acquire చేసేసిందనుకోండి. ఇది బ్లాగులకోసం ఉద్దేశించినది. దీనిని ఉపయొగించడానికి ఆ వెబ్ సైట్ లో ఒక account సృష్టించి, మన వెబ్ సైట్ లో చిన్న code snippet పెడితే చాలు. ఇక అది మన బ్లాగులకు సంబంధించి ఎన్నో వివరాలు సేకరిస్తుంది. ఎలాంటివంటే మన బ్లాగుకి ఎక్కడ నుంచి visitors వస్తున్నారు (ఉదాహరణకి కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ మొదలయిన aggregators లాంటివన్నమాట.), వారు ఏ links మీద click చేస్తున్నారు. ఏ పోస్టులు అంటే ఆసక్తిగా చదువుతున్నారు, ఏ టాగ్స్ అంటే ఇష్టం లాంటివి అన్నమాట. అదే కాక మన బ్లాగు నుంచి ఎక్కడ కి వెళుతున్నారు లాంటివన్నమాట (outgoing links). కాకపోతే ఉచితంగా ఇచ్చే సర్వీసులో వీటి మీద restrictions ఉన్నాయి . మొదటి పది రిజల్ట్స్ మాత్రమే మనకు చూపిస్తాయి వంటివి.
ఇక పోతే రెండవది మన దేవుడు గూగుల్ నుంచి అన్నమాట. దాని పేరు Google Analytics.
గూగుల్ web masters కి ఎంతో స్నెహితుడయిన ఒక సెర్చ్ ఇంజన్. ఇది వారికి ఎన్నో టూల్స్ ఇచ్చి సహాయపడుతుంది. అందులో ఇది ఒకటి. (Google Webmaster Central కూడా మంచి సమాచారం అందిస్తుంది.)
ఇక దీనిని వాడదలచుకుంటే ఇంక మరో టూల్ అవసరమే లేదు. అంత comprehensive అన్నమాట. ఇది వివిధ user profiles (Executive, marketer, web master) కి వివిధ రకాలయిన రిపోర్ట్స్ చూపిస్తుంది. దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద వ్యాసమే అవసరం. టూకీగా చెప్పాలంటే మీ content ని slice and dice చేసి అన్ని రకాల రిపోర్ట్స్ ను అందిస్తుంది. అదీ కాక మీ కంటెంట్ ని ఎలా optimize చెయ్యాలో కూడా అర్థం చేసుకోవచ్చు. మీరు adwords గనక ఉపయోగిస్తుంటే అవి ఎంత effective గా పని చేస్తున్నాయో కూడా ఓ కన్నేసి ఉంచవచ్చు.
ఇది ఎంత సమర్థవంతం అంటే మన వెబ్ సైట్ users వాడే బ్రౌజర్ వర్షన్లు, వారి screen resolutions, వారి screen colors, వారి Java, flash versions, వారి connection speed మొదలయినవి కూడా చెబుతుంది. ఇవన్నీ చాలా ముఖ్యం ఎందుకంటే ఉదాహరణకి మీ వెబ్ సైట్ కి వచ్చే వారిళో ఎక్కువ 800x600 screen resolution వాడుతున్నారనుకోండి, మీ వెబ్ సైట్ వారి కోసం design చెయ్యబడకపోతే మీకు నష్టమే కదా. అలాగే మీరు మీ వెబ్ సైట్ లో latest flash version ఉపయోగిస్తున్నారు. అది పాత versions తో compatible కాదు. అలాంటప్పుడు మరి మీ users కి అది చికాకే కదా. మీ వెబ్ సైట్ కి వచ్చే users ఎక్కువ dialup connection మీద పని చేస్తున్నారనుకోండి, మీ వెబ్ సైట్ jazzy graphics తోనూ పెద్ద పెద్ద images, flash తోనూ నిండి ఉందనుకోండి మరి వారు తిరిగి వచ్చే అవకాశమే లేదు.
ఇలాంటివన్నీ సరి చేసుకోవచ్చు అన్నమాట.
ఉదాహరణకి నా బ్లాగు కి వచ్చే వారిలో ఈ క్రింది విధంగా బ్రౌజర్ల వాడకం ఉంది.

ఇవన్నీ మనకు spy activities లాగా అనిపించచ్చు కానీ professional blogs కీ websites కీ ఇవి చాలా అవసరం. ఎందుకంటే జనాలని మన వెబ్ సైట్ ల మీద ఉండగలిగేలా చెయ్యలంటే ఎం చెయ్యాలో అనేది వారికి ఈ సమాచారం నుంచి లభిస్తుంది. వారి ad placings ఎక్కడ అయితే సమర్థవంతంగా డబ్బు తెచ్చి పెడుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. వారి సైట్లను, బ్లాగులను సమర్థవంతంగా తీర్చి దిద్దవచ్చు.
ఇన్ని చేసినా జనాలు మర్చిపోయేది content గురించి. విజిటర్స్ ని మీ వెబ్ సైట్ లకు రప్పించేది content అందుకని అది సరిగా లేకపోతే ఎన్ని చేసినా అది నిరుపయోగమే.
గమనికలు:
ఇది ఎంత చెప్పుకున్నా తరగని అంతు లేని కథ. నాకు ఇవంటే passion కాబట్టి తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఇంత పెద్ద వ్యాసం రాసినందుకు క్షమించాలి. ఇంకా నాకు సంతృప్తిగా లేదు. మీకు తెలిసింది చెబితే నేనూ నేర్చుకుంటాను :)
ప్రతి సారీ సాధ్యమయినంత తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను కానీ అక్కడక్కడా తప్పదు, కొన్ని నాకు వాటికి సరయిన పదాలు తెలుగు లో తెలీక, కొన్ని వాడటం ఇష్టం లేక.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...