Thursday, June 2, 2011

Gmail ద్వారా మీ బ్లాగ్ పోస్ట్ లు ఆటోమేటిక్ గా ప్రమోట్ అయ్యేటట్లు సెట్టింగ్స్


మీరు పంపే అన్నీ మెయిల్స్ లో సిగ్నేచర్ లింక్స్ ను యాడ్ చేయడం ద్వారా మీ బ్లాగులోని పోస్ట్ లను ప్రమోట్ చేయటానికి ఒక మార్గం ఉంది. మీ బ్లాగును ప్రమోట్ చేయటానకి చాలా మార్గాలున్నాయి. కానీ Gmail లోని Random Signature ఆప్షన్ ద్వారా మీరు సులభంగా మీ బ్లాగులోని పోస్టులతో రీడర్స్ ను అట్రాక్ట్ చేయవచ్చు. మీరు కొత్త పోస్ట్ చేసిన ప్రతీ సారి ఆ పోస్ట్ లింక్ ను కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కు మెయిల్ చేస్తుంటారు కదా. ఇక ఆ అవసరం లేదు. మీరు పంపే మెయిల్ క్రింద ఉన్న సిగ్నేఛర్ లో ఆటోమేటిక్ గా మీ కొత్త పోస్ట్ లింక్ ఏర్పడేటట్లు Gmail లో సెట్టింగ్స్ మార్చండి చాలు.

మరి Gmail లో Random Signature సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా?

1. మీ Gmail అకౌంట్లోకి లాగిన్ అవండి.

2. క్రింది విధంగా Gmail Lab Page ని ఓపెన్ చేయండి.



3. అందులో 1.Random Signature 2.Signature tweaks లను Enable చేసి
Save Changes ను క్లిక్ చేయండి.


4. Settings >> General లోకి వెళ్లండి.

5. Signature box లో మీ సమాచారాన్ని టైప్ చేయండి.


6. తర్వాత Append a random signature కు చెక్ మార్క్ పెట్టండి. దాని పక్కనే ఉన్న ఇన్ పుట్ బాక్స్ లో మీ బ్లాగు feed URL ను ఎంటర్ చేయండి.


7. Save Changes ను క్లిక్ చేయండి. ఇక నుంచి మీరు పంపే మెయిల్స్ లో మీ బ్లాగు లోని పోస్ట్ ల లింక్ లు ఆటోమేటిక్ గా పంపబడతాయి.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...