న్యూజింగ్స్” అనే బ్లాగులో కొత్తపాళీ గారి పేరిట తప్పుడు కామెంట్ పబ్లిష్ అయిన విషయం ఆయన పోస్ట్ చదివి షాక్ అయ్యాను. “ఇలా ఎలా జరిగే అవకాశం ఉంది?” అనే విషయం ఒకరిద్దరు మిత్రులతో సంప్రదించిన తర్వాత కొంత అవగాహన కలిగింది. ఈ సమస్య ఇలా వచ్చే అవకాశముంది.
* కామెంట్ బాక్సుల్లో కన్పించే ఆప్షన్లు:
మనం ఒక బ్లాగులో కామెంట్ రాయడానికి వెళ్లినప్పుడు Post a Comment అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే కన్పించే Comment Boxలో సాధారణంగా Choose an Identity అనే ప్రదేశం వద్ద ఈ క్రింది ఆప్షన్లు కన్పిస్తుంటాయి.
1. Google/Blogger: ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మన జీమెయిల్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అయితేనే మనం మన Gmail ఐడిలో కన్పించే Display name పేరిట కామెంట్ రాయగలుగుతాం.
2. Open ID, Live Journal, Wordpress, AIM వంటి ఇతర సర్వీసుల్లో అకౌంట్ కలిగిన వారు ఆ ఐడెంటిటీ ఆధారంగా కామెంట్లు రాయవచ్చు.
3. Name/URL అనే ఆప్షన్ ఉపయోగించి “ఏదైనా పేరుతో” “ఏదైనా బ్లాగు, సైట్ అడ్రస్ ని” మన ఉనికిగా చూపిస్తూ కామెంట్ రాయవచ్చు. ఈ ఆప్షన్ నే జనాలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ Name వద్ద మీ పేరుని టైప్ చేసి, URL అనే బాక్సులో మీ బ్లాగు అడ్రస్ ని టైప్ చేసి ఎవరి పోస్ట్ లో అయినా కామెంట్ రాశారంటే ఆ కామెంట్ మీరే రాసినట్లు భ్రమకలిగించేలా కామెంట్ పోస్ట్ అవుతుంది. సో ఇలాంటి కామెంట్లని అడ్డుకోవడం అన్నది ప్రతీ బ్లాగు ఓనర్ దృష్టి సారించవలసిన విషయం. ఎన్నో అపార్థాలకు తావిచ్చే ఈ ఆప్షన్ ఎలా డిసేబుల్ చెయ్యాలన్నది ఈ క్రింద వివరిస్తాను.
4. “అజ్ఞాత” పేరుతోనూ కామెంట్లు రాయవచ్చు.
ఆలస్యం చెయయకుండా అందరు బ్లాగర్లు చేయాల్సిన పని/కొత్తవారికి నేర్పించాల్సిన జాగ్రత్త:
మీ Blogger అకౌంట్ లోకి లాగిన్ అయి Dashboardలోకి వెళ్లి Settings>Comments అనే విభాగంలోకి వెళ్లండి. అందులో Who Can Comment అనే విభాగంలో Anyone అని ఉంటే వెంటనే దాని బదులు Registered Users Includes Open ID అనే రెండవ ఆప్షన్ ని టిక్ చేయండి. చివరిగా పేజీని క్రిందికి scrool చేసి Save Settings అనే బటన్ ని క్లిక్ చేయండి. దయచేసి అజాగ్రత్తగా ఉండకుండా ప్రతీ బ్లాగర్ ఈ పని వెంటనే చేయండి.
కొత్త బ్లాగర్లకు సూచనలు:
ఏ పేరుతో అయినా, ఏ బ్లాగు లింకుని ఫాలో చేస్తూ అయినా మీ బ్లాగులో ధూషణలు, ధ్వేషపూరిత, కించపరిచేలా కామెంట్లు వచ్చినట్లయితే.. అది నిజంగా ఆ వ్యక్తి రాశారేమోనని వారిపై ధ్వేషం పెంచుకోకండి. మీరు వెంటనే పైన చెప్పిన సెట్టింగు చేసుకోండి. వ్యక్తుల మధ్య చిచ్చు రగిలించడానికి కొందరు ఇలాంటి చర్యలకూ పాల్పడుతున్నారు.

0 comments:
Post a Comment