Thursday, September 30, 2010

ఫోటోలను స్కెచ్ లు గా మార్చటానికి ఉచిత ఆన్ లైన్ టూల్స్..

డిజిటల్ ఫోటోలను ఆర్టిస్టిక్ స్కెచ్ లు గా మార్చటానికి ఆన్ లైన్ లో చాలా ఉచిత టూల్స్ లభిస్తాయి, వాటిలో కొన్నింటిని యిక్కడ తెలియచేస్తున్నాను:

౧. DUMPR - Photo Pencil Sketch:

DUMPR సైట్ కి వెళ్ళి ముందుగా కావలసిన ఫోటోను అప్ లోడ్ చేసి ఒకేఒక క్లిక్ తో ఫోటోను పెన్సిల్ స్కెచ్ గా మార్చవచ్చు, అలా మారిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులకు ఈ-మెయిల్ పంపవచ్చు.


౨. tjshome - ఆన్ లైన్ ఇమేజ్ కన్వర్టర్:
ఈ సైట్ కి వెళ్ళగానే స్టెప్ ౧ లో వివిధ అప్శన్లు వుంటాయి అవి ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లేదా రెడ్ షేడ్ లేదా స్కెచ్ మొదలగునవి. వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని స్టెప్ ౨ లో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Submit' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇమేజ్ కావలసిన విధంగా మార్చబడుతుంది. అలా మార్చబడిన ఇమేజ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.


౩. befunky :
Befunky సైట్ కి వెళ్ళి ’Get started' పై క్లిక్ చేస్తే Photo Effects ని సెలెక్ట్ చెయ్యమంటుంది. అక్కడ కావలసిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ’Browse Files' పై క్లిక్ చేసి ఇమేజ్ ని అప్ లోడ్ చెయ్యాలి. కావలసిన విధంగా మారిన ఇమేజ్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.




ఆన్ లైన్ లో కాకుండా మనసిస్టం లోనే ఇమేజ్ లను అందమైన పెయింటింగ్స్ గా , స్కెచెస్ గా లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవటానికి fotosketcher అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడూతుంది.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...