TrayOS అనే చిన్న ప్రోగ్రామ్ ని ఉపయోగించి గూగుల్ అప్లికేషన్లు ఒకేచోట అంటే సిస్టం ట్రే నుండే సులువుగా యాక్సెస్ చెయ్యవచ్చు. దానికోసం ముందుగా TrayOS ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, తర్వాత TrayOS సిస్టం ట్రే లో కూర్చుంటుంది. దాని పై క్లిక్ చేసి సైన్ ఇన్ చేసి అన్ని గూగుల్ అప్లికేషన్లను పొందవచ్చు. కొన్ని అప్లికేషన్లు మాత్రమే పైన టాప్ లో కనబడతాయి అయితే ’Settings' పై క్లిక్ చేసి కావలసిన అప్లికేషన్లను స్టార్ట్ చేసుకోవచ్చు. కావలసిన అప్లికేషన్ ఆటోస్టార్ట్ చేసుకోవచ్చు, అనవసరమైన వాటిని డిసేబుల్ చెయ్యవచ్చు.
వెబ్‌సైట్: TrayOS
0 comments:
Post a Comment